TTD News Latest | తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ కు మరియు స్కీంలకు విరాళాలు వెల్లువలా వస్తున్నాయని పేర్కొన్నారు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు.
ఇందులో భాగంగా వైజాగ్ కు చెందిన మైత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఛైర్మన్ శ్రీనివాసరావు, ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.కోటి విరాళం ఇచ్చారు. ఈ మేరకు క్యాంపు కార్యాలయంలో ఛైర్మన్ బీఆర్ నాయుడిని కలిసి చెక్కు అందజేశారు.
ఇదిలా ఉండగా దాత శ్రీనివాసరావు గుంటూరు నుండి కాలినడకన 12 రోజుల పాటు పాదయాత్రగా తిరుమలకు వచ్చి విరాళం ఇచ్చారు. రూ.కోటి రూపాయలు విరాళం అందజేసి శ్రీవారిపై తనకున్న భక్తివిశ్వాసాలను శ్రీనివాసరావు చాటుకున్నారని బీఆర్ నాయుడు అభినందించారు.
దాత శ్రీనివాసరావు గతంలో కూడా పలు మార్లు కోట్లాది రూపాయలు టీటీడీ ట్రస్ట్ లకు విరాళాంగా అందజేశారని గుర్తుచేశారు.