Monday 16th March 2026
12:07:03 PM
Home > తెలంగాణ > తప్పు చేస్తే ఎవ్వరినీ వదిలి పెట్టం: మంత్రి పొంగులేటి హెచ్చరిక!

తప్పు చేస్తే ఎవ్వరినీ వదిలి పెట్టం: మంత్రి పొంగులేటి హెచ్చరిక!

ponguleti srinivas reddy

Ponguleti Srinivas Reddy | తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (cm revanth reddy) ఆదివారం కలెక్టర్లు, ఎస్పీ లతో సమావేశమైన విషయం తెలసిందే. ఈ మీటింగ్ అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

ఇందిరమ్మ రాజ్యం లో ప్రజల వద్దకే పాలన ప్రజా పాలన అని చెప్పిన విధంగా ఈ సమావేశంలో అద్భుత నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ప్రజా పాలన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

అర్హులైన ప్రతి వారికి ఇచ్చిన మాట ప్రకారం.. వారి గుమ్మం వద్ద కి పాలన తీసుకెళుతున్నామని చెప్పారు. ప్రజా పాలన కార్యక్రమం కి 25 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించారు. అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం.

తెలంగాణలో కక్ష పూరితంగా ఏ ఒక్కరిపై చర్యలు ఉండవన్నారు. కానీ, తప్పు చేస్తే ఎంతటి వారిని అయిన వదిలి పెట్టమని హెచ్చరించారు. చిన్నచూపు చూడకుండా ప్రభుత్వ అధికారులు చిన్న గూడెం అయినా, చెంచు గూడెం అయినా వెళ్లాల్సిందేనని ఆదేశించారు.

You may also like
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Minister Adluri Laxman
‘గోదావరి పుష్కరాలు ఘనంగా నిర్వహించాలి’
KTR press meet
‘ఆరు గ్యారెంటీ ల కోసం ప్రైవేట్ మెంబర్ బిల్లు పెడతాం’
engineering fee in tg
రాష్ట్రంలో ఇంజనీరింగ్ ఫీజులు ఖరారు.. అత్యధికం ఎంతంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions