Tuesday 17th March 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > H1-B వీసా ఫీజు భారీగా పెంపు..ట్రంప్ సంతకంతో ఇండియన్స్ కు షాక్

H1-B వీసా ఫీజు భారీగా పెంపు..ట్రంప్ సంతకంతో ఇండియన్స్ కు షాక్

Trump Slaps $100,000 Fee On H-1B Visas | అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. హెచ్1-బి వీసా వార్షిక ఫీజును ఏకంగా లక్ష డాలర్లకు పెంచుతూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై శుక్రవారం రాత్రి సంతకం చేశారు.

ఈ నిర్ణయంతో భారతీయులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. సెప్టెంబర్ 21 నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుంది. కాగా అమెరికాలోని కంపెనీలు విదేశీ నిపుణులను ఉద్యోగాల్లోకి తీసుకునేందుకు ఈ వీసాను తీసుకువచ్చారు. ఇందులో 70 శాతానికి పైగా భారతీయులే ఉన్నారు.

మరో 11 శాతం చైనా దేశస్థులు ఉన్నారు. హెచ్1-బి వీసా రుసుమును లక్ష డాలర్లకు పెంచడంతో భారతీయులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఉద్యోగాలు చేసి వచ్చే సంపాదనలో అధిక భాగం వీసా రుసుముకే వెళ్ళిపోతే ఎలా అని పలువురు ఆందోళన చెందుతున్నారు.

కాగా ఫీజు పెంచడం పట్ల ట్రంప్ స్పందించారు. దేశ భద్రతను దృషిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అత్యంత నైపుణ్యం కలిగిన వ్యక్తులే తమ దేశంలోకి రావాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు.

You may also like
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !
gaddar awards
గద్దర్ సినీ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం.. ఉత్తమ చిత్రం ఏదంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions