Wednesday 22nd January 2025
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > మెలానియాకు ముద్దుపెట్టబోయిన ట్రంప్..అడ్డొచ్చిన టోపి

మెలానియాకు ముద్దుపెట్టబోయిన ట్రంప్..అడ్డొచ్చిన టోపి

Trump-Melania Miss Kiss | అగ్రరాజ్యం అమెరికా 47వ అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ( Donald Trump ) ప్రమాణ స్వీకారం చేశారు. ఈ వేడుక రాజధాని వాషింగ్టన్ ( Washington DC ) లోని క్యాపిటల్ ( Capitol Hill ) భవనంలో జరిగింది.

ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమం సందర్భంగా ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. ప్రమాణం చేసేందుకు వెళ్తూ భార్య మెలానియా ( Melania )వద్దకు ట్రంప్ వచ్చారు.

ఆప్యాయంగా ఆమెను ముద్దాడేందుకు ప్రయత్నించారు. అయితే మెలానియా తలపై ధరించిన టోపి వారికి అడ్డొచ్చింది. ఈ క్రమంలో వారు కాస్త ఇబ్బంది పడ్డారు. ఈ సన్నివేశం అక్కడి వారి పెదవులపై నవ్వును విరబూసేలా చేసింది.

అనంతరం ట్రంప్ దంపతులు మరియు వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ ( JD Vance ) దంపతులు డాన్స్ చేసి అలరించారు. మరోవైపు అమెరికా ఉపాధ్యక్షుడిగా జేడీ వ్యాన్స్ ప్రమాణం చేశారు.

ఈ క్రమంలో ఆయన సతీమణి అమెరికా సెకండ్ లేడీ ( Second Lady ) ఉష చిలుకూరు భర్తవైపు గర్వంగా చూస్తున్న వీడియోలు తెగ వైరల్ గా మారాయి. కాగా ఉష చిలుకూరు అమెరికాలో పుట్టి పెరిగిన తెలుగు అమ్మాయి.

You may also like
డిప్యూటీ సీఎంపై టీడీపీ నేతల వ్యాఖ్యలు..జనసేన కీలక సూచన
చిలుకూరు బాలాజీ ఆలయంలో ప్రియాంక చోప్రా..న్యూ జర్నీ పై పోస్ట్
హిల్ చర్చ్ – కేబీకే హాస్పిటల్ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంపు!
‘చెరువుల్ని నాశనం చేసే ఎయిర్పోర్ట్ వద్దు’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions