Wife Threatens Husband On 1st Night | హనీమూన్ కు వెళ్లి భర్తను ప్రియుడితో కలిసి భార్య హతమార్చిన ఘటన ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటన మరువకే ముందే మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.
పెళ్లై ఫస్ట్ నైట్ గదిలోకి వెళ్లిన భార్య కత్తితో భర్తను బెదిరించింది. తనను ముట్టుకుంటే 35 ముక్కలు చేస్తానంటూ హెచ్చరించింది. వివరాల్లోకి వెళితే.. యూపీలోని ప్రయాగ్ రాజ్ లో నివాసం ఉంటున్న నిషాద్ (Nishad) కు సితార (Sitara) అనే యువతితో వివాహం జరిగింది. ఈ సందర్భంగా వారి ఫస్ట్ నైట్ (First Night) రోజు గదిలోకి వెళ్లిన సితార కత్తితో నిషాద్ ను హెచ్చరించింది.
“తనను ముట్టుకుంటే 35 ముక్కలుగా మారుతావు. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. నేను అమన్ అనే వ్యక్తిని ప్రేమిస్తున్నా” అని బెదిరించింది. ఈ విషయం ఇరు కుటుంబాలకు చెప్పడంతో సితారకు సర్దిచెప్పారు. అయినప్పటికీ ఆమెలో మార్పు కలగలేదు.
నేను అమన్‌ను ప్రేమిస్తున్నాను. నా హనీమూన్ అతడితోనే. నాకు నిశాద్‌తో జీవించాలనే ఆలోచన లేదని ఖరాకండీగా చెప్పేసింది. ఆమె తన ప్రియుడితో మాట్లాడిన చాటింగ్, ఫోన్ కాల్స్ ని కుటుంబ సభ్యులకు చూపించింది.
చివరికి మే 30న రాత్రి ఆమె ఇంటి గోడ దూకి అమన్ తో పారిపోయింది. ఇలాంటి వరుస ఘటనలు పెళ్లి చేసుకోవాలనుకునే యువతలో భయాందోళనకు గురి చేస్తున్నాయి.










