Thursday 10th April 2025
12:07:03 PM
Home > తాజా > రాజకీయాల్లోకి రావాలంటే అవన్నీ వదిలేయాల్సిందే: బన్నీ వాస్

రాజకీయాల్లోకి రావాలంటే అవన్నీ వదిలేయాల్సిందే: బన్నీ వాస్

bunny vasu

Bunny Vasu Comments on Politics | టాలీవుడ్ నిర్మాత బన్నీ వాస్ (Bunny Vasu) రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

బాగా చదువుకుని, బాగా సంపాదించి ఉంటే ఇంట్లో ఉండాలి తప్ప రాజకీయాల్లోకి రావొద్దని ఆయన సలహా ఇచ్చారు. కానీ, ఎవరైనా రాజకీయాల్లోకి రావాలనుకుంటే మాత్రం సిగ్గు, లజ్జ వదిలేయాలని సూచించారు.

హైదరాబాద్‌లో నిర్వహించిన ‘కోట బొమ్మాళి పీఎస్’ (Kota Bommali PS) సినిమా థాంక్యూ మీట్‌లో ఆయన రాజకీయాలపై ఈ వ్యాఖ్యలు చేశారు.

సినిమా గురించి ప్రస్తావిస్తూ పలువురు జర్నలిస్టులు రాజకీయాలకు సంబంధించి ప్రశ్నలు అడిగారు.

ఈ సందర్భంగా బన్నీ వాస్ మాట్లుడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాల్లోకి రావాలంటే సిగ్గు, లజ్జ అన్నీ వదిలేసి.. నన్ను ఎవ్వడు తిట్టినా ఫర్వాలేదు, నా ఫ్యామిలీ ఫొటోస్ ఎవడైనా సోషల్ మీడియాలో పెట్టినా ఫర్వాలేదు.. నా కూతురు, పెళ్లాం ఎవ్వరిని ఏమన్నా నాకేం పట్టదు అన్నట్టు ఉండాలి.

బట్టలిప్పి రోడ్డు మీద నిలబడగలిగినోడే ఈరోజు రాజకీయాల్లోకి వెళ్లగలడు కానీ.. ఒక విద్యావంతుడు, ఆత్మాభిమానం ఉన్నవాడు, ఒక చిన్న మాటన్నా హర్ట్ అయ్యేవాడు ఈరోజు రాజకీయాలకు పనికిరాడు’ అని వ్యాఖ్యానించారు.

తాను రాజకీయాల్లోకి వెళ్లాలన్నా అలా ప్రిపేరవ్వాల్సిందేనని చెప్పారు. అలాంటి మానసిక శక్తి, స్ట్రాంగ్ బ్రెయిన్ నాకు లేకపోతే నేను కూడా ఇంట్లో కూర్చోవడం మంచిదన్నారు.

You may also like
kiran chebrolu
వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు.. టీడీపీ కార్యకర్త అరెస్టు!
అమెరికా vs చైనా..సుంకాల పోరు!
పోలీస్ వాహనంతో ఆకతాయిల రీల్స్..అయినా కేసు ఎందుకు పెట్టలేదంటే!
‘అగ్నిప్రమాదం.. మార్క్ శంకర్ ఫోటో వైరల్’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions