Indian Army Day | మన దేశంలో ఏటా జనవరి 15న ఇండియన్ ఆర్మీ డే (Indian Army Day) జరుపుకొంటారు. అందులో భాగంగా నేడు 77వ ఆర్మీ డే వేడుకలు నిర్వహించారు.
ఏటా జనవరి 15న నిర్వహించడానికి ప్రధాన కారణం భారత్ కి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1949 జనవరి 15న జనరల్ కె.ఎం. కరియప్ప (Indian Army Day) భారత సైన్యానికి మొదటి కమాండర్ ఇన్ చీఫ్ (Commander In Chief) గా బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం జనవరి 15న భారత సైనిక దినోత్సవాన్ని జరుపుకుంటారు. అంతకు ముందు, బ్రిటిష్ వారు భారత సైన్యానికి బ్రిటిష్ అధికారి కమాండర్-ఇన్-చీఫ్ గా ఉండేవారు. ఆర్మీ దినోత్సవం న్యూఢిల్లీలోని కరియప్ప పరేడ్ గ్రౌండ్ లో సైనికులు కవాతు నిర్వహిస్తారు.
ఇందులో భారత సైన్యం తమ ఆయుధాలను ప్రదర్శిస్తుంది. సైనిక విన్యాసాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ ఏడాది ఆర్మీ డే వేడుకలను సమర్థ్ భారత్ సక్షమ్ సేన అనే థీమ్ తో నిర్వహించారు.





