Monday 28th April 2025
12:07:03 PM
Home > బిజినెస్ > మూడు రోజులపాటు సమావేశమైన ఆర్బీఐ ఎంపీసీ

మూడు రోజులపాటు సమావేశమైన ఆర్బీఐ ఎంపీసీ

The RBI MPC met for three days

-ఎంపీసీ తీసుకున్న నిర్ణయాలను వెల్లడించిన గవర్నర్ శక్తికాంతదాస్
-రెపోరేటులో ఎలాంటి మార్పు చేయలేదన్న ఆర్బీఐ
-రిజర్వు బ్యాంకు వడ్డీ రేట్లు యథాతథం..

వడ్డీరేట్లను 6.50 శాతం వద్ద యథాతథంగా కొనసాగించనున్నట్టు భారతీయ రిజర్వు బ్యాంకు ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) శుక్రవారం ప్రకటించింది. మూడు రోజులపాటు కొనసాగిన ఎంపీసీ సమావేశం అనంతరం కమిటీ తీసుకున్న నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. 6.5 శాతంగా ఉన్న రెపోరేటులో ఎలాంటి మార్పులు చేయలేదని, అది అలాగే కొనసాగుతుందని శక్తికాంత దాస్ తెలిపారు. కాగా ఈ నెల 6 నుంచి నేటి వరకు ఎంపీసీ సమావేశమైంది.

ఎంపీసీలో తీసుకున్న కీలక నిర్ణయాలు

  • ఆసుపత్రులు, విద్యాసంస్థలకు యూపీఐ చెల్లింపు పరిమితి లక్ష నుంచి 5 లక్షలకు పెంపు
  • రికరింగ్ చెల్లింపుల ఈ-మ్యాండేట్ పరిమితి రూ. 15 వేల నుంచి లక్షకు పెంపు
  • డిజిటల్ లెండింగ్‌లో పారదర్శకత పెంపునకు రుణ ఉత్పత్తుల వెబ్ అగ్రిగేషన్ కోసం రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్
  • ఫిన్‌టెక్ రిపోజిటరీ ఏప్రిల్ 2024 నాటికి ఆర్బీఐ ఇన్నోవేషన్ హబ్ ద్వారా నిర్వహిస్తారు.
You may also like
asaduddin owaisi
పాకిస్తాన్ కు అసదుద్దీన్ ఓవైసీ స్ట్రాంగ్ వార్నింగ్!
tgsrtc
నిజాయతీ చాటుకున్న కండక్టర్ కు సన్మానం!
cm revanth reddy
కేసీఆర్ ప్రసంగంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఏమన్నారంటే!
భారత్ – పాక్ ఉద్రిక్తతలపై అమెరికా కీలక సూచన!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions