TG Cabinet Meeting | తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమైన అంశాలపై చర్చించి, ఆమోదం తెలిపేందుకు నిర్వహించే కేబినెట్ సమావేశాలను (Cabinet Meetings) ఇక నుంచి నెలకు రెండు సార్లు నిర్వహించాలని నిర్ణయించింది.
ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం (TG CMO) నుండి ఆదేశాలు జారీ అయ్యాయి. విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో తలెత్తుతున్న అనవసర జాప్యాన్ని నివారించి, ప్రభుత్వ కార్యకలాపాలను మరింత చురుగ్గా ముందుకు తీసుకెళ్లడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Read Also: ప్రపంచంలోనే ఎత్తైన బ్రిడ్జ్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ!
ఇక నుంచి ప్రతి నెల మొదటి మరియు మూడవ శనివారాల్లో కేబినెట్ సమావేశం జరగనున్నట్లు సమాచారం. కాగా, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డనాటి నుంచి ఇప్పటి వరకు 17 కేబినెట్ మీటింగ్ లు జరిగాయి. కాగా, గురువారం సాయంత్రం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
ప్రభుత్వ ఉద్యోగులకు రెండు DAలు ఇచ్చేందుకు అంగీకరించింది. తక్షణమే ఒక DAను ఇస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. రెండో DAను మరో 6 నెలల్లో ఇస్తామన్నారు. రైతులందరికీ ఒకేసారి రైతు భరోసా మొత్తాన్ని అందించాలనే ప్రతిపాదనపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. రైతులందరికీ ఒకేసారి రైతు భరోసా ఇవ్వడానికి అవసరమైన నిధులు జమచేసుకుని.. ఒక మంచి రోజు చూసుకుని ఆ మొత్తాన్ని పంటవేసే నాటికే ఇవ్వాలనే మంత్రివర్గం అభిప్రాయపడింది.









