Monday 16th March 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ఏపీ డిప్యూటీ సీఎంతో కాంగ్రెస్ సీనియర్ నేత భేటీ!

ఏపీ డిప్యూటీ సీఎంతో కాంగ్రెస్ సీనియర్ నేత భేటీ!

pawan and vh

VH meets Pawan Kalyan | ఆంధ్రప్రదేశ్ (Andra Pradesh)ఉప ముఖ్యమంత్రి, జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan)ను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ ఎంపీ వి. హనుమంత రావు (V Hanumantha Rao) మర్యాద పూర్వకంగా కలిశారు.

ఏపీలోని మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో వీహెచ్ పవన్ తో భేటీ అయ్యారు. ఆంధ్ర ప్రదేశ్ లోని కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరును పెట్టాలని ఈ సందర్భంగా హనుమంతరావు విజ్ఞప్తి చేశారు. దామోదరం సంజీవయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారని గుర్తు చేశారు.

సామాజిక పెన్షన్లు రావడంలో, కార్మికులకు వివిధ రకాల ప్రయోజనాలు కల్పించడంలో సంజీవయ్య పాత్ర ఎనలేనిదని వివరించారు. ఈ నేపథ్యంలో సంజీవయ్య పేరుతో ఒక స్మారక భవనాన్ని నిర్మించాలని ఏపీ డిప్యూటీ సీఎం ను వీహెచ్ కోరారు.

ఈ సందర్భంగా వీహెచ్ ప్రస్తావించిన  అంశాలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళతానని వీహెచ్ కు పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. అనంతరం  పవన్ కల్యాణ్ వీహెచ్‌కు శాలువాను కప్పి సత్కరించారు. గణపతి విగ్రహాన్ని బహూకరించారు.  

You may also like
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !
Minister Adluri Laxman
‘గోదావరి పుష్కరాలు ఘనంగా నిర్వహించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions