Terror Attack In Jammu And Kashmir’s Pahalgam | జమ్మూకశ్మీర్ లో మరోసారి ఉగ్రవాదులు అమాయకులపై దాడులకు పాల్పడ్డారు.
అనంతనాగ్ జిల్లాలోని పహల్గామ్ ప్రాంతంలో పర్యాటకులే లక్ష్యంగా ముష్కరులు దాడులకు పాల్పడ్డారు. మినీ స్విట్జర్లాండ్ గా పేర్కొనే పహల్గామ్ లోని బైసరన్ ప్రాంతంలో ఉగ్రవాదుల కాల్పుల మూలంగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. బుల్లెట్ల గాయాల కారణంగా పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ ప్రాంతానికి కేవలం కాలినడకన, లేదా గుర్రాలపై మాత్రమే వెళ్ళాలి. మరోవైపు బైసరన్ లో కాల్పుల శబ్దం విన్న భద్రతా దళాలు వెంటనే ఘటనాస్థలికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.