Friday 11th July 2025
12:07:03 PM
Home > తాజా > సీఎం రేవంత్ రెడ్డికి గుడి.. రెడ్డి సంఘం కీలక ప్రకటన!

సీఎం రేవంత్ రెడ్డికి గుడి.. రెడ్డి సంఘం కీలక ప్రకటన!

revanth reddy

Temple For CM Revanth | తెలంగాణ రెడ్డి (Telangana Reddy) అభిమానుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేడి సంతోష్ కీలక ప్రకటన చేశారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కి త్వరలోనే గుడిని నిర్మించనున్నట్లు తెలిపారు.

నల్గొండ జిల్లా, చిట్యాల మండలం, వనిపాకల గ్రామంలో మార్చి 19న సీఎం రేవంత్ ఆలయ భూమి పూజ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు చామల కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవనున్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన సంఘం అధ్యక్షులు.. దేవుడు ఏ రకంగా భక్తుల కోర్కెలు తీరుస్తాడో అదే రకంగా సీఎం రేవంత్ తెలంగాణ ప్రజల కోర్కెలు తీరుస్తున్నారని తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో నడిపిస్తున్నారని అందుకోసమే ఆయనకు గుడి నిర్మించననున్నట్లు చెప్పారు.

కనిపించని దేవుడి కంటే ప్రజల బాగోగులు చూస్తున్న సీఎం రేవంతే తమకు తెలంగాణ దేవుడని అన్నారు రెడ్డి సంఘం నాయకులు.

కాగా ఇప్పటికే ప్రధాని మోదీ, కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ, దివంగత మాజీ సీఎంలు ఎన్టీఆర్, వైఎస్సార్ లకు కూడా గుడి నిర్మించారు. అంతేకాకుండా మాజీ సీఎం కేసీఆర్ గుడి కూడా ఉంది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ జాబితాలో చేరనున్నారు.

You may also like
‘కల్తీ కల్లు ఘటన..రూ.20 లక్షల పరిహారం ఇవ్వాలి’
‘నారా లోకేశ్-మాధవ్ భేటీ..తెలంగాణ అస్థిత్వంపై దాడి’
‘సకాలంలో యూరియాను సరఫరా చేయండి’
bandi sanjay comments
పేదలకు ఒక న్యాయం.. అక్బరుద్దీన్ కుఒక న్యాయమా: బండి సంజయ్!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions