Monday 16th March 2026
12:07:03 PM
Home > తాజా > ‘భారీ వర్షాలు..ఇసుక బస్తాలు సిద్ధం చేయండి’

‘భారీ వర్షాలు..ఇసుక బస్తాలు సిద్ధం చేయండి’

Telangana Rains News | పూర్తిగా నిండిన చెరువులు, రిజర్వాయర్ల వద్ద ఇసుక బస్తాలను ముందుగానే సిద్ధంగా ఉంచాలని అధికారులకు స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి.

భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో అన్ని శాఖ‌ల అధికారులు, సిబ్బంది మ‌రింత అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. నిజామాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, వికారాబాద్‌, జ‌య‌శంక‌ర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావ‌ర‌ణ శాఖ సూచ‌న‌ల నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి శనివారం ఉదయం ఉన్న‌తాధికారుల‌తో మాట్లాడారు.

వాతావ‌ర‌ణ శాఖ అందంచిన స‌మాచారం మేరకు, 15 జిల్లాల్లో అధిక వ‌ర్ష‌పాతం, మిగ‌తా జిల్లాల్లో సాధార‌ణ వ‌ర్ష‌పాతం న‌మోదైంద‌ని తెలిపారు. వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండే జిల్లాల్లో ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ముందుగానే మొహరించారని, వారు కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలు చేపట్టాలని తెలిపారు.

వాగులు, వంకలు పొంగే ప్రమాదం ఉన్నందున జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉంటూ, లోత‌ట్టు ప్రాంతాల్లోని కుటుంబాలను సహాయక శిబిరాలకు తరలించాలన్నారు. నీటి పారుద‌ల శాఖ అధికారులు, సిబ్బంది రిజ‌ర్వాయ‌ర్లు, చెరువులు, కుంట‌ల నీటి మ‌ట్టాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిశీలిస్తూ నీటి విడుద‌ల‌పై ముందుగానే క‌లెక్ట‌ర్లు, క్షేత్ర స్థాయి సిబ్బందికి స‌మాచారం ఇవ్వాల‌ని సూచనలు చేశారు.

You may also like
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
gaddar awards
గద్దర్ సినీ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం.. ఉత్తమ చిత్రం ఏదంటే!
kalvakuntla kavitha
‘ఎస్సీల రిజర్వేషన్లు 18 శాతానికి పెంచాలి’
రాష్ట్రంలో కాంగ్రెస్ బుల్డోజర్ రాజ్యం

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions