Telangana Praja Palana Day News | హైదరాబాద్ లోని పబ్లిక్ గార్డెన్స్ లో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం నిర్వహించింది ప్రభుత్వం. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు.
అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. కళా బృందాలతో కలిసి రాష్ట్ర గీతం జయజయహే తెలంగాణ ఆలపించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..ప్రపంచంలోనే సువర్ణ అక్షరాలతో లిఖించదగిన పోరాటం తెలంగాణ సొంతం అని అన్నారు.
ప్రజలే రాసుకున్న పోరాట చరిత్ర మనదని పేర్కొన్నారు. తెలంగాణ సాయుధ పోరాట స్పూర్తితో నియంత పాలనను పక్కన పెట్టినట్లు చెప్పారు.









