Telangana Police News | తెలంగాణ పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పర్యటించే విదేశ, స్వదేశ పర్యాటకుల భద్రత కోసం టూరిస్ట్ పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేయనుంది.
ఈ మేరకు బుధవారం డీజీపీ కార్యాలయంలో తెలంగాణ పర్యాటక శాఖ, పోలీస్ శాఖ సమన్వయ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మొదటి దశలో భాగంగా రాష్ట్రంలో వివిధ పర్యాటక ప్రాంతాల్లో 80 మంది టూరిస్ట్ పోలీసులు పని చేయనున్నట్లు డీజీపీ జితేందర్ తెలిపారు.
సెప్టెంబర్ 27న ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఈ వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని ప్రకటించారు. పర్యాటకులకు మెరుగైన భద్రత కల్పించాలనే లక్ష్యంతో ఈ వ్యవస్థ పని చేస్తుందని వివరించారు.
అలాగే ఈ వ్యవస్థ మూలంగా పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు. కాగా అనంతగిరి, సోమశీల, యాదగిరిగుట్ట, రామప్ప, భద్రాచలం, అమ్రాబాద్, నాగార్జున సాగర్ వంటి పర్యాటక ప్రదేశాల్లో టూరిస్ట్ పోలీసులు సేవలందించనున్నారు.










