Saturday 11th April 2026
12:07:03 PM
Home > తాజా > ఇంటర్ ఫలితాలు రేపే.. వాట్సప్ లోనే చెక్ చేసుకోండి!

ఇంటర్ ఫలితాలు రేపే.. వాట్సప్ లోనే చెక్ చేసుకోండి!

tg results clarity

TG Inter Result | తెలంగాణ ఇంటర్ పరీక్ష (Telangana Inter Results) ఫలితాలకు రంగం సిద్ధం అయ్యింది. ఆదివారం ఫలితాలు విడుదల చేయనున్నట్లు రాష్ట్ర ఇంటర్ బోర్డు ప్రకటించింది.

అయితే మీ సేవకు వెళ్లాల్సిన అవసరం లేకుండా విద్యార్థులు తమ ఫలితాలను తమ వాట్సప్ నుంచే తెలుసుకునే సదుపాయాన్ని కల్పించింది.

రాష్ట్రవ్యాప్తంగా సుమారు తొమ్మిదిన్నర లక్షల మంది విద్యార్థులు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు జరిగిన ఇంటర్ పరీక్షల్లో పాల్గొన్నారు. ఆదివారం వెలువడే ఫలితాలను విద్యార్థులు నేరుగా స్మార్ట్ ఫోన్ నుంచే డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. ఫలితాలు వెలువడకముందే విద్యార్థులు తమ ఫోన్లో 8096958096 నంబర్ ను సేవ్ చేసుకోవాలి.

ఫలితాలు ప్రకటించిన తర్వాత ఈ నంబర్ కు వాట్సప్ లో హాయ్ అనే మెసేజ్ చేయాలి. ఆ తర్వాత ‘BIE Exam Results’ అని టైప్ చేయడం ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

You may also like
tg results clarity
తప్పుడు ప్రచారం నమ్మొద్దు.. ఇంటర్ ఫలితాలపై విద్యాశాఖ స్పష్టత!
Students
తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల.. బాలికలదే పైచేయి!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions