Telangana Indiramma Illu Scheme | తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో తన పేరుపై ఇల్లు మంజూరైన విషయం తెలుసుకున్న ఓ మహిళ ఆనందంతో కన్నీరు పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక కోసం తెలంగాణ వ్యాప్తంగా గ్రామ, వార్డు సభలు జరుగుతున్న విషయం తెల్సిందే. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పథకాలకు దరఖాస్తులను స్వీకరించి గ్రామ సభలోనే లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో సుల్తానాబాద్ మండలం రేగడిమద్దికుంట గ్రామంలో కూడా మంగళవారం గ్రామ సభను నిర్వహించారు. ఇందులో వాలకట్ల భూమమ్మ అనే మహిళ పేరు మీద ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది.
వాలకట్ల భూమమ్మ పేరు మీద ఇల్లు మంజూరైంది అని అధికారులు ప్రకటించగానే అక్కడే ఉన్న ఆ మహిళ కన్నీరు పెట్టుకున్నారు. ఆమె ఆనందబాష్పాలు అందరి హృదయాలని హత్తుకున్నాయి.