Telangana HC quashes drone case against CM Revanth Reddy | జన్వాడ లోని ఓ ఫార్మ్ హౌస్ వద్ద డ్రోన్ ఎగురవేసిన ఘటన అప్పట్లో సంచలనంగా మారిన విషయం తెల్సిందే. ఇదే కేసుకు సంబంధించి రేవంత్ రెడ్డిని పోలీసులు 18 రోజుల జైలుకు తరలించారు.
తాజగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై నమోదైన కేసును తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. జన్వాడ లోని ఫార్మ్ హౌస్ వద్ద రేవంత్ రెడ్డి డ్రోన్ ఎగురవేశారని 2020 మార్చిలో కేసు నమోదైన విషయం తెల్సిందే. నార్సింగి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అవ్వగా, పోలీసులు అప్పట్లో రేవంత్ రెడ్డిని రిమాండ్ కు తరలించడం సంచలనంగా మారింది.
ఇదే సమయంలో తనపై నమోదైన ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలని రేవంత్ రెడ్డి హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాజగా వాదనలు సందర్భంగా జన్వాడ ఫార్మ్ హౌస్ ఏమి నిషేధ ప్రాంతం కాదని, తప్పుడు సెక్షన్లు నమోదు చేసారని రేవంత్ తరఫు న్యాయవాది వాదించారు. వాదనలు విన్న న్యాయస్థానం రేవంత్ రెడ్డిపై నమోదైన కేసును కొట్టివేసింది.