TS Governor Republic Day Speech | తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు గణతంత్ర దినోత్సవ సందర్భంగా శుక్రవారం నాంపల్లి లోని పబ్లిక్ గార్డెన్స్ లో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు ఆమె.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. (TS Governor Republic Day Speech) దురహంకారానికి, నిరంకుశత్వానికి తావు లేదని, ప్రజా తీర్పుతో ఇది స్పష్టం అయిందని తెలిపారు. గత ప్రభుత్వం సామాన్యులకు అందుబాటులో ఉండేది కాదు. ప్రజలు తమ ఫిర్యాదులను సమర్పించేందుకు గందరగోళానికి గురయ్యారని పేర్కొన్నారు.
తెలంగాణలో పదేళ్ల నియంతృత్వ పాలనకు తెరపడిందని, గత పదేళ్లలో ధ్వంసమైన రాజ్యాంగ వ్యవస్థలను, విలువలను పునర్నిర్మిస్తున్నామన్నారు. ఏకపక్ష నిర్ణయాలు & నియంతృత్వ విధానాలు ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధం అని చెప్పారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రస్తుత ప్రభుత్వం తొలిసారిగా రాజ్యాంగ స్ఫూర్తితో పని చేస్తోందని, గత ప్రభుత్వ పాలనా లోపం వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు గవర్నర్ తమిళి సై.