Indiramma Indlu checks | తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకానికి తొలి అడుగు పడింది. వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద తొలి దశ లబ్ధిదారులకు మంగళవారం చెక్కులు పంపిణీ చేశారు.
శంషాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన 12 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించిన మొదటి విడత చెక్కులను అందజేశారు.
రంగారెడ్డి, సూర్యాపేట, ఖమ్మం, వికారాబాద్, మహబూబ్ నగర్, సిద్దిపేట జిల్లాల వాసులు ఈ ఇందిరమ్మ పథకం తొలి విడత చెక్కులు అందుకున్నారు. ఇందిరమ్మ పథకంలో భాగంగా సొంత స్థలం ఉన్నవారికి ఇల్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం దశలవారీగా ఐదు లక్షల రూపాయల సాయం అందించనుంది. అందులో భాగంగా తొలివిడతలో లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించింది.