Dil Raju As TGFDC Chairman | టాలీవుడ్ (Tollywood) అగ్ర నిర్మాత, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ (Sri Venkateshwara Creations) అధినేత దిల్ రాజు(Dil Raju)కు తెలంగాణ ప్రభుత్వం కీలక పదవి కట్టబెట్టింది.
తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ (Telangana Film Development Corporation Chariman) గా ఆయన్ని నియమించింది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి (Telangana CS Shanti Kumari) ఉత్తర్వులు జారీ చేశారు. దిల్ రాజు ఈ పదవిలో రెండేళ్ల పాటు కొనసాగనున్నారు.
ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై మూడు సినిమాలు తెరకెక్కుతున్నాయి. రామ్ చరణ్ (Ram Charan)- శంకర్ కాంబోలో రానున్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) వచ్చే ఏడాది జనవరి 10న ప్రేక్షకుల ముందుకురానుంది.
అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో వెంకటేశ్ (Venkatesh) హీరోగా నటిస్తున్న ‘సంక్రాంతికి వస్తున్నాం” కూడా వచ్చే ఏడాది జనవరి 14న విడుదల కానుంది. దీంతోపాటు వేణు శ్రీరామ్ (Venu Sriram) దర్శకత్వంలో రానున్న ‘తమ్ముడు’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు దిల్ రాజు.