Monday 16th March 2026
12:07:03 PM
Home > తాజా > కేసీఆర్ పై ఎంతమంది పోటీచేస్తున్నారంటే..!

కేసీఆర్ పై ఎంతమంది పోటీచేస్తున్నారంటే..!

kcr news

Total Mla Candidates In Telangana| తెలంగాణ ( Telangana ) ఎన్నికల సమరంలో నామినేషన్ల ఘట్టం బుధవారం తో ముగిసింది. మొత్తం 119 నియోజకవర్గాలలో 2290 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు.

నామినేషన్ల ( Nominations ) ఉపసంహరణకు బుధవారం చివరి రోజు కావడం తో 608 మంది అభ్యర్థులు తమ నామినేషన్స్ విత్ డ్రా చేసుకున్నారు. అత్యధికంగా కేసీఆర్ ( KCR ) పోటీ చేస్తున్న గజ్వెల్ ( Gajwel ) నుండి 70 మంది తమ నామినేషన్లను వెనక్కి తీసుకున్నారు.

దీంతో 44 మంది గజ్వెల్ బరిలో ఉన్నారు. అలాగే కేసీఆర్ మరియు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) తలపడుతున్న కామారెడ్డి ( Kamareddy )సెగ్మెంట్ లో 39 మంది బరిలో నిలిచారు.

అత్యధికంగా ఎల్బీ నగర్ ( Lb Nagar ) నుండి 48 మంది, మునుగోడు ( Munugode ) 39, పాలేరు ( Paleru ) నుండి 37, కోదాడ, నాంపల్లి 34, ఖమ్మం 32, నల్గొండ 31 మంది పోటీలో ఉన్నారు. అత్యల్పంగా నారాయణపేట ( Narayanapet ), బాన్స్ వాడ నియోజకవర్గల బరిలో ఏడుగురు, బాల్కొండ ( Balkonda ) నుండి 8 మంది పోటీలో ఉన్నారు.

ఇదిలా ఉండగా నవంబర్ 28న ప్రచారానికి తెర పడనుంది. నవంబర్ 30 న ఎన్నికలు, డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి.

You may also like
Election commission
ఆడపిల్ల పుడితే రూ.10 వేలు.. పెళ్లికి రూ. 25 వేలు!
‘టీడీపీ కి వెన్నుపోటు..రేవంత్ ఓ ద్రోహి’
‘ప్రభుత్వ విద్యార్థులకు 22 వస్తువులతో కూడిన కిట్’
‘ఇంటి అల్లుడి ఫోన్ ట్యాప్ చేయడానికి సిగ్గుండాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions