Friday 30th January 2026
12:07:03 PM
Home > తాజా > స్విట్జర్లాండ్ సీఎంతో రేవంత్ భేటీ..హైదరాబాద్ కు ‘స్విస్ మాల్’

స్విట్జర్లాండ్ సీఎంతో రేవంత్ భేటీ..హైదరాబాద్ కు ‘స్విస్ మాల్’

Telangana CM discusses idea of building a ‘Swiss Mall’ in Hyderabad at Davos | వరల్డ్ ఎకనామిక్ ఫోరం-2026 లో భాగంగా దావోస్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, స్విట్జర్లాండ్‌లోని వాడ్ రాష్ట్ర ముఖ్యమంత్రి క్రిస్టెల్ లూసియర్ బ్రోడార్‌తో కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో భారత్–స్విట్జర్లాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య సహకార పెంపుపై చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్–2047 విజన్‌ను స్విస్ ప్రతినిధులకు వివరించారు.

హైదరాబాద్‌లో ప్రపంచంలోనే తొలిసారి ‘స్విస్ మాల్’ ఏర్పాటు చేయాలనే ఆలోచనను ముఖ్యమంత్రి ప్రతిపాదించగా, స్విస్ బృందం సానుకూలంగా స్పందించింది. ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు ఫుట్‌బాల్ క్రీడపై మక్కువ ఎక్కువ ఉన్నవారే కావడం విశేషం. ఈ క్రమంలో క్రీడల రంగంలో భాగస్వామ్యంపై కూడా విస్తృతంగా చర్చించారు. క్రీడా శిక్షణ, మౌలిక వసతుల అభివృద్ధిలో కలిసి పనిచేయవచ్చని అభిప్రాయపడ్డారు.

You may also like
మేడారంలో అద్భుత దృశ్యం..జనంలోకి సమ్మక్క
పోలీసులకు గుడ్ న్యూస్..బర్త్ డే, పెళ్లి రోజున సెలవులు
కేసీఆర్ కు నోటీసులు..’సూర్యుడిపై ఉమ్మివేయడమే’
తల్లి పుట్టినరోజు..జిరాఫీలను దత్తత తీసుకున్న పవన్

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions