Telangana Budget 2025 -26 | తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) బుధవారం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గానూ ఆర్ధిక మంత్రి భట్టి విక్రమార్క (Minister Bhatti Vikramarka) ఉదయం 11.06 గంటలకు అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
ఈ ఏడాది రూ.3,04,965 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ప్రవేశ పెట్టిన బడ్జెట్ ఇదే.
ఏ శాఖకు ఎంతంటే..!
మొత్తం బడ్జెట్ రూ. 3,04,965 కోట్లు
వ్యవసాయ శాఖకు రూ. 24,439
పశు సంవర్ధక శాఖకు రూ. 1,674 కోట్లు
పౌరసరఫరాల శాఖకు రూ. 5,734 కోట్లు
విద్యాశాఖకు రూ. 23,108 కోట్లు
కార్మిక ఉపాధికల్పనకు రూ. 900 కోట్లు
పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధికి రూ. 31,605 కోట్లు
మహిళా శిశు సంక్షేమానికి రూ. 2,862 కోట్లు
షెడ్యూల్ కులాల సంక్షేమానికి రూ. 40,234 కోట్లు
షెడ్యూల్ తెగలకు రూ. 17,169 కోట్లు
వెనుకబడిన తరగతుల శాఖకు రూ. 11,405 కోట్లు
చేనేత రంగానికి రూ. 371 కోట్లు
మైనారిటీ సంక్షేమానికి రూ. 3,591 కోట్లు
పరిశ్రమల శాఖకు రూ. 3,527 కోట్లు
ఐటీ శాఖ కు రూ. 774 కోట్లు
విద్యుత్ శాఖకు రూ. 21,221 కోట్లు
వైద్య ఆరోగ్య శాఖకు రూ. 12,393 కోట్లు
మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి శాఖకు రూ. 17,677 కోట్లు
నీటిపారుదల శాఖకు రూ. 23,373 కోట్లు
హోం శాఖకు రూ. 10,188 కోట్లు
దేవాదాయ శాఖకు రూ. 190 కోట్లు
అడవులు పర్యావరణ శాఖకు రూ. 1,023 కోట్లు
క్రీడాశాఖకు రూ. 465 కోట్లు
పర్యాటకశాఖకు రూ. 775 కోట్లు రోడ్లు భవనాలు శాఖకు రూ. 5,907 కోట్లు