Telangana Results | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ ముగిసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది.
మొత్తం 119 నియోజకవర్గాల్లో 64 స్థానాలు గెలుపొంది కాంగ్రెస్ (Congress) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.
అధికార బీఆరెస్ పార్టీ (BRS Party) 39 స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ 8 స్థానాలు, ఎంఐఎం 7, సీపీఎం 1 స్థానంలో గెలుపొందాయి.
ఈ ఎన్నికల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నారు. దాదాపు ఆరుగురు మంత్రులు పరాజయం చవిచూశారు.
ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, నిరంజన్ రెడ్డి, పువ్వాడ అజయ్, కొప్పుల ఈశ్వర్ ఈ ఎన్నికల్లో ఓడిపోయారు.
బీజేపీలో హేమాహేమీలు కూడా ఓటమి పాలయ్యారు. బండి సంజయ్, ఈటల రాజేందర్, రఘునందన్ రావు, సోయం బాపూరావు, ధర్మపురి అర్వింద్ లకు ఓటమి తప్పలేదు.
హైదరాబాద్ లో గులాబీదే ఆధిపత్యం.. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభంజనం స్రుష్టించింది. తెలంగాణలో హస్తం హవా బలంగా వీచింది.
ముఖ్యంగా ఉమ్మడి నల్లగొండ, మహబూబ్ నగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో కాంగ్రెస్ దాదాపుగా స్వీప్ చేసింది.
కానీ, జీహెచ్ఎంసీలో మాత్రం బీఆర్ఎస్ ఆధిపత్యం కొనసాగించింది. నగర పరిధిలోని కాంగ్రెస్ కనీసం బోణీ కొట్టలేకపోయింది. ఎంఐఎం 7, బీజేపీ 1 స్థానం మినహా మిగిలిన స్థానాల్లో బీఆరెస్ విజయం సాధించింది.