Tej Pratap Yadav Order’s Cop To Dance | ఏయ్ సిపాయ్ ! పాటకు డాన్స్ చెయ్ లేదంటే సస్పెండ్ అవుతావ్ అంటూ ఓ పోలీసు అధికారిని హెచ్చరించారు బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజ్ ప్రతాప్ యాదవ్.
దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ క్రమంలో ఆర్జేడీ నాయకుడిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శనివారం పాట్నాలో పార్టీ నేతలు కార్యకర్తలతో కలిసి తేజ్ ప్రతాప్ యాదవ్ హొలీ వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పోలీసు అధికారిని ఉద్దేశించి ‘ ఏయ్ సిపాయ్ పాటకు డాన్స్ చెయ్ లేదంటే సస్పెండ్ అవుతావ్’ అంటూ తేజ్ ప్రతాప్ అన్నారు. హొలీ కదా తప్పుగా అనుకోవద్దు అంటూ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యల పట్ల బీజేపీ తీవ్రంగా మండిపడింది.
తండ్రి లాగే తనయుడు ఉన్నాడని, ఇలాంటి పనుల వల్లే బీహార్ ను జంగల్ రాజ్ గా లాలూ ప్రసాద్ మార్చారని బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆర్జేడీ ప్రతిపక్షంలో ఉంటేనే పరిస్థితి ఇలా ఉంటే అధికారంలోకి వస్తే ఎలా ఉంటుందో ప్రజలు ఆలోచించాలని బీజేపీ, జేడీయూ నాయకులు పోస్టులు చేస్తున్నారు.