Teenmaar Mallanna New Political Party News | శాసనమండలి సభ్యుడు తీన్మార్ మల్లన్న నూతన రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. గత కొంతకాలంగా బీసీ వాదాన్ని వినిపిస్తున్న తీన్మార్ మల్లన్న బుధవారం నాడు ‘తెలంగాణ రాజ్యాధికార పార్టీ’ ఏర్పాటు చేశారు.
హైదరాబాద్ లోని తాజ్ కృష్ణ హోటల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నూతన పార్టీ పేరును ప్రకటించారు. బీసీలకు రాజకీయ పార్టీ అవసరం ఉందన్న ఉద్దేశ్యంతోనే ఈ పార్టీని ఏర్పాటు చేసినట్లు వివరించారు. సెప్టెంబర్ 17 బీసీల తలరాత మారే దినంగా తాను భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇకపోతే పార్టీ జెండాను ఎరుపు మరియు ఆకుపచ్చ రంగులలో ఉంది. జెండా మధ్యలో పిడికిలి, కార్మిక చక్రం మరియు వరి కంకులు ఉన్నాయి. జెండా పైభాగంలో ఆత్మగౌరవం, అధికారం మరియు వాటా అనే నినాదాలు ప్రస్తావించబడ్డాయి.
అదేవిధంగా, పార్టీ పేరును పిడికిలి దిగువన తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని పేర్కొన్నారు. పార్టీ జెండాను బిసి మేధావి నారా గోని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మల్లన్న ఆకుపచ్చ రంగు అంటే రైతులు, ఎరుపు రంగు అంటే పోరాటం అని ప్రకటించారు.









