Teacher Gets 6 Months In Jail And Rs.1 Lakh Fine For Slapping Student | గుజరాత్ రాష్ట్రంలో ఓ విద్యార్థిని ఘోరంగా దండించిన ఉపద్యాయుడికి కోర్టు ఆరు నెలల జైలు శిక్షతో పాటుగా రూ.లక్ష జరిమానా విధించింది.
ఘటన జరిగిన ఐదున్నర సంవత్సరాల తర్వాత విద్యార్థికి న్యాయం జరిగింది. వివరాల్లోకి వెళ్తే గుజరాత్ వడోదర నగరంలో జస్బిర్ చౌహన్ అనే వ్యక్తి ప్రైవేట్ కోచింగ్ సెంటర్ నడిపిస్తున్నాడు. అందులో ఇంగ్లీష్ మరియు సోషల్ సైన్స్ బోధించేవారు. 2019లో ఈ కోచింగ్ సెంటర్ లో తేజస్ భట్ అనే వ్యక్తి తన కుమారుడ్ని ప్రైవేట్ కోచింగ్ సెంటర్ లో చేర్పించాడు.
ఒకరోజు టీచర్ చౌహాన్ విద్యార్థిని ఘోరంగా దండించాడు. మొఖం, చెవుల మీద బలంగా కొట్టడంతో చెవిలో నుండి రక్తస్రావం అయ్యింది. దాడి నేపథ్యంలో టీచర్ ను విద్యార్థి తల్లిదండ్రులు నిలదీయగా అతడు క్షమాపణలు చెప్పాడు. అయితే తనపై టీచర్ అనేకసార్లు దాడి చేసినట్లు విద్యార్థి తల్లిదండ్రులు చెప్పాడు.
ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు పోలీసు కేసు నమోదు చేశారు. ఈ ఘటన 2019లో జరిగింది. ఐదేళ్లకు పైగా జరిగిన విచారణ అనంతరం టీచర్ దాడి చేసినట్లు వడోదర ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ నిర్దారించింది. ఈ క్రమంలో ఆరు నెలల జైలు శిక్ష మరియు రూ.లక్ష జరిమానా విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది.









