TDP MLA’s remarks against Jr NTR spark row | యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ నేత దగ్గుబాటి ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు చేసినట్లుగా ఉన్న ఒక ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇటీవల విడుదల అయిన ‘వార్-2’ సినిమాకు సంబంధించి జరిగిన సంభాషణలో భాగంగా ఎన్టీఆర్ పై ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు చేసినట్లుగా ప్రచారం జరుగుతుంది. ఆడియో వైరల్ గా మారడంతో ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ స్పందించారు. తాను మొదటి నుంచి నందమూరి కుటుంబానికి అభిమానిని అని చెప్పుకొచ్చారు. బాలకృష్ణ, ఎన్టీఆర్ సినిమాలంటే ఇష్టంగా చూసేవాడినని అన్నారు. తాను జూనియర్ ఎన్టీఆర్ ను దూషిస్తున్నట్టుగా ఆడియో కాల్స్ సృష్టించారని, ఆ ఆడియో కాల్స్ తనవి కాదని, రాజకీయ కుట్రలో భాగంగానే చేస్తున్నారని పేర్కొన్నారు.
ఈ మేరకు ఆయన ఓ వీడియో రిలీజ్ చేశారు. నారా, నందమూరి కుటుంబాలకు తాను ఎప్పటికీ విధేయుడునేనని తెలిపారు. ఈ ఆడియో కాల్స్ వల్ల జూనియర్ అభిమానులు మనసును నచ్చుకొని ఉంటే తన వైపు నుంచి క్షమాపణ చెబుతున్నట్లు ఎమ్మెల్యే స్పష్టం చేశారు.









