Tamannah Bhatia & Vijay Verma Celebrate Holi Together Amid BREAK UP Rumours | నటి తమన్నా, నటుడు విజయ్ వర్మ గత కొంతకాలంగా రిలేషన్షిప్ లో ఉన్న విషయం తెల్సిందే. అయితే వీరిద్దరూ విడిపోయారని బాలీవుడ్ లో ప్రచారం జరుగుతుంది.
2023 లో విడుదలైన ‘లస్ట్ స్టోరీస్-2’ వెబ్ సిరీస్ షూటింగ్ సమయంలో తమన్నా, విజయ్ వర్మ మధ్య పరిచయం ఏర్పడి, ప్రేమగా మారింది. అయితే పెళ్ళీ, కెరీర్ విషయంలో వచ్చిన విబేధాలు కారణంగా వీరు విడిపోయారని ప్రచారం జరిగింది.
ఈ ప్రచార నేపథ్యంలో హొలీ వేడుకల్లో ఇద్దరూ పాల్గొన్నారు. బాలీవుడ్ నటి రవీనా టాండన్ ఏర్పాటు చేసిన హొలీ పార్టీకి తమన్నా, విజయ్ హాజరయ్యారు. గతంలో ఏదైనా పార్టీకీ హాజరయ్యే సమయంలో ఇద్దరూ కలిసి వచ్చేవారు. కానీ రవీనా ఇంట్లో జరిగిన పార్టీకి మాత్రం ఇద్దరూ విడివిడిగా వచ్చారు.
ఫోటోగ్రాఫర్లకు పలకరించి హొలీ శుభాకాంక్షలు చెప్పారు. బ్రేకప్ ర్యూమర్స్ వస్తున్న సమయంలో ఇద్దరూ ఒకే పార్టీకి హాజరవడం ఆసక్తిగా మారింది.