Surya Tilak Ceremony Of Ayodhya Ram Mandir on Auspicious Occasion of Ram Navami | శ్రీరాముడి జన్మస్థలం అయోధ్యలో శ్రీరామ నవమి వేడుకలు అంబరాన్నంటాయి. ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరిగిన అనంతరం ఇది రెండవ శ్రీరామ నవమి.
శ్రీరామ నవమి నేపథ్యంలో బాలరాముడిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ నేపథ్యంలో ఆదివారం అయోధ్య ఆలయంలో ఓ అద్భుత ఘట్టం భక్తులను పరవశించేలా చేసింది. ఆలయంలోని గర్భగుడిలో కొలువైన బాలరాముడి నుదిటిపై పై ‘సూర్యతిలకం’ ఆవిష్కృతమైంది.
దీనికోసం శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రత్యేక ఏర్పాట్ల నేపథ్యంలో బాల రాముడి నుదిటపై సుమారు నాలుగు నిమిషాల పాట సూర్య కిరణాలు ప్రకాశించాయి. శ్రీరామ నవమి సందర్భంగా అయోధ్య ఆలయంలో ప్రత్యేక అభిషేకం, పూజ కార్యక్రమాలు నిర్వహించారు.