Stray dogs in Shimla to be tagged with QR and GPS | హిమాచల్ ప్రదేశ్ శిమ్లా మున్సిపల్ కార్పోరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది.
నగరంలో ఉండే వీధి కుక్కలకు క్యూఆర్ కోడ్, జీపీఎస్ అమార్చాలని అధికారులు నిర్ణయించారు. శిమ్లాలో వీధి కుక్కల బెడద తీవ్రమయ్యింది. చిన్నారులు, వృద్ధులను వీధి కుక్కలు వెంబడించడం, దాడి చేయడం వంటి ఘటనలు అధికం అయ్యాయి.
ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తం అయ్యారు. వీధి శునకాలకు క్యూఆర్ కోడ్, జీపీఎస్ అమార్చాలని నిర్ణయించారు. ఈ స్మార్ట్ ట్యాగుల ద్వారా కుక్కల స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్, వయస్సు మరియు ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవచ్చు. వీధి కుక్కల సమస్యను నియంత్రించడంలో ఇవి ఉపయోగ పడతాయని అధికారులు భావిస్తున్నారు.
అలాగే జీపీఎస్ ఆధారంగా కుక్కల పై ఎప్పటికప్పుడు నిఘా ఉంచవచ్చని అధికారులు పేర్కొన్నారు. కాగా ఢిల్లీ, నేషనల్ క్యాపిటల్ రీజియన్ లో వీధి కుక్కలను నగరం బయట షెల్టర్ల ఏర్పాటు చేసి తరలించాలని సుప్రీం కోర్టు ఇటీవలే ఆదేశాలు జారీ చేసిన విషయం తెల్సిందే.









