Steve Smith Reaches 10K Test Runs | తమ అభిమాన ఆటగాడు కీలక మైలురాయిని అందుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ అద్భుత దృశ్యాన్ని చూడడానికి సదరు క్రికెటర్ అభిమానులు ఏకంగా 8,358 కి.మీ ప్రయాణించారు.
ఆసీస్ స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ ( Steve Smith ) శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో 10,000 పరుగుల మైలురాయిని అందుకుని చరిత్ర సృష్టించారు. లెగ్ స్పిన్నర్ గా టీంలోకి వచ్చిన స్మిత్ అనంతరం మేటి బ్యాటర్ గా నిలిచాడు.
ఈ క్రమంలో తాజగా తన 115వ మ్యాచులో టెస్టుల్లో 10,000 పరుగులు పూర్తి చేసిన 15వ ఇంటర్నేషనల్ ప్లేయర్ గా నిలిచాడు. ఆస్ట్రేలియా వేదికగా జరిగిన బోర్డర్-గావస్కర్ ( Border-Gavaskar ) ట్రోఫీలో స్మిత్ 9,999 టెస్టు పరుగుల వద్ద నిలిచిపోయిన విషయం తెల్సిందే.
అనంతరం శ్రీలంక వేదికగా బుధవారం ఆస్ట్రేలియా తొలి టెస్టు మ్యాచ్ ను ఆడింది. ఈ క్రమంలో స్టీవ్ స్మిత్ 10000 టెస్టు పరుగులు సాధించే అద్భుత దృశ్యాన్ని కనులారా వీక్షించాలని భావించిన కొందరు అభిమానులు ఏకంగా 8,358 కి.మీ ప్రయాణించి ఆస్ట్రేలియా నుండి శ్రీలంక చేరుకున్నారు.
తొలి టెస్టులో సెంచరీ చేసిన స్మిత్ 10,000 పరుగుల మైలురాయిని అందుకున్న నేపథ్యంలో అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు.