Thursday 21st November 2024
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > లోకేశ్ అన్నా.. ప్లీజ్ నన్ను క్షమించండి!

లోకేశ్ అన్నా.. ప్లీజ్ నన్ను క్షమించండి!

srireddy

Srireddy Letter to Nara Lokesh | ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో విపక్ష కూటమి నేతలపై వీడియోలతో, అసభ్య పదజాలంతో రెచ్చిపోయిన ఆ పార్టీ సానుభూతిపరురాలు శ్రీరెడ్డికి కేసుల భయం పట్టుకుంది.

కూటమి ప్రభుత్వం వైసీపీ సోషల్ మీడియా నేతల్ని వరుసగా అరెస్టులు చేస్తున్న నేపథ్యంలో శ్రీరెడ్డి అరెస్టు కూడా తప్పదనే ప్రచారం మొదలైంది. ఇప్పటికే ఆమెపై అనకాపల్లితో పాటు రాజమండ్రిలో రెండు కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో గురువారం మంత్రి నారా లోకేష్ కు బహిరంగ లేఖ రాశారు.

శ్రీరెడ్డి లేఖ యథాతథంగా..


ముందుగా లోకేష్ అన్నకి విజ్ఞప్తి. లోకేష్ అన్న, నేను పుట్టింది గోదావరి, అయినా పెరిగింది మొత్తం విజయవాడ పరిసర ప్రాంతాల్లోనే. అందుకే నాకు మీ కమ్యూనిటీ వాళ్లే 95% ఫ్రెండ్స్. ఈ విషయాన్ని అనేక వీడియోల్లో కూడా చెప్పాను. వెరీ రేర్ కేసుల్లో  నేను మెన్షన్ చేసుంటాను కానీ అవమానించలేదు. మా అమ్మ నాన్న గారికి కూడా విజయవాడతోనే ఎక్కువ అనుబంధం. అలాగే మా సొంత ఇల్లూ కూడా అక్కడే.  అమరావతి రావడం మా ఇంట్లో వాళ్ళని ఎంతో సంతోషపెట్టింది. ఎందుకంటే వాళ్ళకున్న చిన్న సొంత ఇల్లు రేట్లు పెరిగాయని. అందుకే మా అమ్మానాన్నలు టీడీపీకే ఓటు వేశారు. లోకేష్ అన్నా.. మీరు కొన్ని విషయాలలో ఎంత మొండిగా ఉంటారో,

అంతకంటే ఎక్కువ, మంచితనం కూడా ఉందని ఈ నా కేసుల విషయంలో మాట్లాడమని నేను అంతకుముందు వీడియో మెన్షన్ చేసినట్టు Sorry చెప్పించింది కూడా మా కుటుంబసభ్యలే). అలాగే మా కుటుంబసభ్యులు మీతో డైరెక్ట్ గా మాట్లాడమని చెప్పారు అయినా నాకంత స్థాయి లేదు. అందుకే ఈ ఓపెన్ లెట్టర్.

అన్నా!  నేను మా పార్టీని, కార్యకర్తల్ని, మా అధికారులని, మీ అనుబంధ మీడియా సంస్థలని, జనసేన, వీర మహిళలని, వారి కుటుంబ సభ్యులకి నేను అనేక సందర్భాలలో సారీ చెప్పడం జరిగింది. అనేక సార్లు నేను ర్యూడ్ గా మాట్లాడటం జరిగింది. మీ అందరికీ మళ్ళీ క్షమించమని గత పదిరోజులుగా మీడియాలో వచ్చే కథనాలు, కథనాల కింద మీ కార్యకర్తలు పెట్టే కామెంట్లు, మీ నాయకులు నాపై చేసే కామెంట్లు, స్పీచ్ లు, డిస్కషన్లు,  చూసిన తరువాత అలాగే కూటమిలో ఉన్న అందరూ చేసిన దాడి తరువాత నాకు అర్థమైంది. నేను ఎంతమంది మనోభావాల్ని దెబ్బతీసానో. బాధపెట్టానో అర్థమైంది. ఇప్పుడు నేను నిజంగా చెప్తున్నా. ఒక వెంకటేశ్వరస్వామి భక్తురాలిగా ప్రమాణం చేసి చెప్తున్నాను (మా కులదైవం కూడా). ఇంతమంది మనోభావాలు జుగుప్సాకర భాషలో నేను మాట్లాడి తప్పు చేశాను. ఇంత పూజలు, ప్రార్ధనలు చేసే నేను ఈ పాపం ఎలా చేశానో, ఏ కండ కావరంతో చేశానో నాకు అర్దం కాలేదు. అందుకే ముందుగా

చీఫ్ మినిస్టర్

చంద్రబాబునాయుడు గారికి, లోకేష్ గారికి, వారి కుటుంబ సభ్యులకి,  TV5, ఆంధ్రజ్యోతి, ఐటీడీపీకి, టీడీపీ కార్యకర్తలకి, సోషల్ మీడియాకి సారీ.

జనసేన మీడియా:-99టీవీ, ప్రైమ్ 9, వీరమహిళలు, సోషల్ మీడియాకి, పవన్ కళ్యాణ్ కి నా హృదయపూర్వక క్షమాపణలు. దయచేసి మీ అందరూ పెద్దమనసు చేసుకుని

మీ తెలుగమ్మాయిని క్షమించండి.

 లోకేశ్ అన్నా.. నా ఫ్యామిలీ మీద ఒట్టేసి చెపున్నా. ఇప్పటి పరిస్థితుల నుంచి కోలుకోవటానికి ఈ లెట్టర్ అనుకోకండి.. కానే కాదు… ఈ వారం రోజులు ఆహారం, నిద్ర లేకుండా కామెంట్స్ చదివి, ఎంత మనోవ్యధకి గురై తీసుకున్న నిర్ణయం. నేను ఒక విషయం అంటే దయచేసి నొచ్చుకోకండి.

భవిష్యత్తులో వైసీపీ వచ్చినా తిరిగి నా బుద్ధి వక్రం అవుతుందని అనుకోకండి. అలా చేస్తే ప్రైవేట్ వ్యక్తులతో నన్ను ఏమైనా చేయించుకోవచ్చు. ఇకపై అభ్యంతరకర భాష వాడనని మా కులదైవం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నా దాకా వచ్చేసరికి నేను చేసిన తప్పు ఏంటని అరమైంది ఎంత బాధ ఉంటుందో అని.

ఇప్పటికి నేను, నా కుటుంబం అనుభవించిన క్షోభ 1000 సంవత్సరాలకు సరిపడా అనుభవించాం.. ఇంట్లో పెళ్ళికావలసిన పిల్లలు ఉన్నారు. నాకు కొంత కాలానికి ఒక నెల లేదా 3 నెలలకు గాయాలు మానవచ్చు.. కానీ నా వల్ల ముగ్గురికి జీవితాంతం శిక్ష వేసినదాన్ని అవుతాను.

ప్లీజ్ అన్నా నా ఫ్యామిలీని కాపాడండి. ఇక మీడియా, సోషల్ మీడియా, అలాగే కేసుల నుంచి నన్ను బంధవిముక్తురాల్ని చెయ్యండి. Lokesh అన్నా ప్లీజ్. నేను ఇంకా ఎవరికైనా సారీ చెప్పటం మరిచిపోతే, వారికి కూడా పేరు పేరునా క్షమాపణలు అడుగుతున్న.. మూవీ ఫీల్డ్స్ వారికి చిరంజీవి, నాగబాబు గార్లు, అందరికీ కూడా నా క్షమాపణలు…

Sri Reddy (Movie field)- failed

Sri Reddy (Politics) failed  (agreed)

షర్మిలక్క, సునీతక్క మీరు కూడా నన్ను క్షమించండి.

ఇట్లు

శ్రీరెడ్డి

You may also like
థ్యాంక్యూ డిప్యూటీ సీఎం పవన్ సార్
అదానీపై అమెరికాలో కేసు..షేర్లు డమాల్ !
ఝార్ఖండ్ ఎవరి సొంతం !
మహారాష్ట్రలో అధికారాన్ని కైవసం చేసుకోబోయేది ఎవరంటే !

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions