Sreeleela In Pushpa 2 | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun ), రష్మిక ( Rashmika ) జంటగా సుకుమార్ ( Sukumar ) తెరకెక్కిస్తున్న మూవీ పుష్ప 2 ది రూల్ ( Pushpa 2 The Rule ). ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ కోసం యువ నటి శ్రీలీల ( Sreeleela ) ను ఎంపిక చేసినట్లు వచ్చిన కథనాలు నిజం అయ్యాయి.
ఈ మేరకు మూవీ టీం అధికారికంగా ప్రకటించింది. పుష్ప 2 లోకి శ్రీలీలను వెల్ కమ్ ( Welcome ) చేస్తూ ఒక పోస్టర్ ను విడుదల చేశారు. కిస్సిక్ సాంగ్ ఆఫ్ ది ఇయర్ ( Kissik Song Of The Year ) లో శ్రీ లీల అల్లు అర్జున్ సరసన స్టెప్పులు వేయనుంది. ఈ సాంగ్ అభిమానులకు డాన్స్ ఫీస్ట్, మ్యూజికల్ డిలైట్ గా ఉండబోతున్నట్లు టీం తెలిపింది.
కాగా అల్లు అర్జున్ మరియు శ్రీలీల ఇద్దరూ డాన్స్ అద్భుతంగా చేసేవాళ్లే కావడంతో పుష్ప 2లోని స్పెషల్ సాంగ్ థియేటర్ల వద్ద రచ్చ చేయడం గ్యాంరటీ అంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. పుష్ప పార్ట్ 1 లో కూడా సమంత ( Samantha ) అల్లు అర్జున్ సరసన స్పెషల్ సాంగ్ లో స్టెప్పులు వేసిన విషయం తెల్సిందే.