Speaker Clean chit To MLA | బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసులో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ (Speaker Gaddam Prasad) కీలక నిర్ణయం తీసుకున్నారు.
పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కుంటున్న మరో ఎమ్మెల్యేకు క్లీన్ చిట్ ఇచ్చారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పార్టీ మారినట్లుగా దాఖలైన పిటిషన్ పై స్పీకర్ విచారణ చేపట్టారు. ఈ క్రమంలో సంజయ్ పార్టీ మారినట్లు సరైన ఆధారాలు లేవని స్పీకర్ స్పష్టం చేశారు.
సంజయ్ కు క్లీన్ చిట్ ఇచ్చారు. రాష్ట్రంలో మొత్తం 10 మంది ఎమ్మెల్యేలపై పార్టీ ఫిరాయింపుల పిటిషన్లు దాఖలవ్వగా.. ఇప్పటి వరకూ 8 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు దానం నాగేందర్ (Danam Nagendar) , కడియం శ్రీహరిల (Kadiyam Srihari) పై స్పీకర్ నిర్ణయం తెలియాల్సి ఉంది.
కాగా, బుధవారం కడియం శ్రీహరిని స్పీకర్ విచారించనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ తాను బీఆర్ఎస్ పార్టీ నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచానని, ఇప్పటికీ ఆ పార్టీ ఎమ్మెల్యేగానే ఉన్నానని స్పష్టం చేశారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ బిల్లులు ప్రవేశపెట్టి విప్ జారీ చేస్తే ఆ పార్టీ ఎమ్మెల్యేగానే మద్దతు ఇస్తానని తెలిపారు.










