SIT Likely to Issue Notice to KCR in Phone Tapping Case | తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగా సిట్ దూకుడు పెంచింది. వారం రోజుల వ్యవధిలోనే బీఆరెస్ పార్టీకి చెందిన అగ్ర నేతలను సిట్ విచారణకు పిలిచింది. తొలుత మాజీ మంత్రి హరీష్ రావు ఆ తర్వాత బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచారు. తాజగా రాజ్యసభ మాజీ ఎంపీ సంతోష్ రావును కూడా సిట్ ప్రశ్నించింది. ఇకపోతే మిగిలింది బీఆరెస్ అధినేత కేసీఆర్.
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కు కూడా సిట్ నోటీసులు జారీ సూచనలు కనిపిస్తున్నాయి. అతి త్వరలోనే ఆయనకు నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. నేడో రేపో కేసీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు కథనాలు వస్తుండడం సంచలనంగా మారింది.









