Shepherd’s son cracks UPSC | బిరదేవ్ సిద్ధప్పా ఢోణే మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాకు చెందిన యమగే గ్రామానికి చెందినవారు. తండ్రి సిద్ధప్ప గొర్రెలకాపరి.
సామాన్య కుటుంబంలో జన్మించినప్పటికీ అసాధారణ పట్టుదలతో UPSC సివిల్ సర్వీసెస్ పరీక్ష 2024లో ఆల్ ఇండియా ర్యాంక్ 551 సాధించి జీవితంలో ఉన్నత స్థాయిని చేరుకున్నారు. అతను కుర్బా సమాజానికి చెందినవాడు, ఆర్థిక సవాళ్లు, సామాజిక అడ్డంకులను అధిగమించి, కోచింగ్ లేదా గైడెన్స్ లేకుండా, కేవలం స్వయం శిక్షణ మరియు కఠిన శ్రమతో ఈ విజయాన్ని సాధించాడు.
బిర్ దేవ్ జీవితం ఎందరికో స్ఫూర్తిగా నిలవనుంది. ఫలితాలు విడుదల అయిన సమయంలో బిర్ దేవ్ కర్ణాటక బెలగావి లోని నానవది గ్రామంలో బంధువులతో ఉన్నాడు. బిర్ దేవ్ కు ఆల్ ఇండియా 551 ర్యాంక్ వచ్చిందని తెలుసుకున్న కుటుంబ సభ్యులు, కురుబ సామాజిక వర్గ పెద్దలు హర్షం వ్యక్తం చేశారు.
ఇదే సమయంలో గొర్రెల మంద మధ్యలోనే బిర్ దేవ్ ను ఘనంగా సత్కరించారు. పూల దండలు, తమ సంప్రదాయ ధన్ గర్ తలపాగా చుట్టి ఒక మేకను బహుకరించారు. బీ టెక్ చేసిన బిర్ దేవ్ ఐపీఎస్ కావాలని కలలుకన్నాడు. పూణే లోని కాలేజీలో బి.టెక్ పూర్తి చేసిన బిర్ దేవ్ తొలి రెండు ప్రయత్నాల్లో విఫలం అయ్యాడు. అనంతరం మూడవ ప్రయత్నంలో యూపీఎస్సి పరీక్షలో ఆల్ ఇండియా 551 ర్యాంక్ ను సొంతం చేసుకున్నాడు.