Monday 30th March 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > BIG BREAKING: షారుఖ్ ను చంపేస్తామంటూ బెదిరింపులు

BIG BREAKING: షారుఖ్ ను చంపేస్తామంటూ బెదిరింపులు

Shah Rukh Khan Receives Death Threat | బాలీవుడ్ ( Bollywood ) స్టార్ నటుడు సల్మాన్ ఖాన్ ( Salman Khan ) ను చంపేస్తామంటూ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ శపథం పూనిన విషయం తెల్సిందే.

ఇప్పటికే సల్మాన్ సన్నిహితుడు మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దిఖీ ( Baba Siddique )ని లారెన్స్ గ్యాంగ్ కాల్చి చంపిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ పరిణామాల నేపథ్యంలో బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ ( Shah Rukh Khan ) కు హత్యా బెదిరింపులు వచ్చాయి.

ఈ సారి ఏకంగా షారుఖ్ కే ఫోన్ చేసిన దుండగులు చంపేస్తాం అంటూ బెదిరించారు. ఈ నేపథ్యంలో ముంబై లోని బాంద్రా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

బెదిరింపు కాల్ చేసింది, ఛత్తీస్ ఘడ్ రాయపూర్ నివాసి ఫైజాన్ ఖాన్ అని పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో ఇప్పటికే ముంబై పోలీసులు రాయపూర్ బయలుదేరినట్లు తెలుస్తోంది. కాగా సల్మాన్ బాబా సిద్దిఖీ షారూఖ్ ల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

You may also like
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
gaddar awards
గద్దర్ సినీ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం.. ఉత్తమ చిత్రం ఏదంటే!
kalvakuntla kavitha
‘ఎస్సీల రిజర్వేషన్లు 18 శాతానికి పెంచాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions