Shah Rukh Khan injured while shooting for King | బాలీవుడ్ స్టార్ నటుడు షారూక్ ఖాన్ షూటింగ్ సమయంలో గాయపడ్డారు. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
షారుక్ మరియు ఆయన కుమార్తె సుహానా ఖాన్ ప్రధాన పాత్రలో సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తున్న సినిమా ‘కింగ్’. యాక్షన్ కథాంశంతో ఇది షూటింగ్ జరుపుకుంటోంది. అయితే డూపు లేకుండా ఓ యాక్షన్ సీన్ లో పాల్గొన్న షారుక్ కు గాయం అయ్యింది.
ఇది తీవ్రమైన గాయం కాదని, కండరాల గాయం అయినట్లు మూవీ టీం తెలిపింది. ఈ నేపథ్యంలో చికిత్స కోసం షారుక్ మరియు ఆయన టీం అత్యవసరంగా అమెరికాకు వెళ్లినట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
దింతో జులై, ఆగస్ట్ నెలల్లో జరగాల్సిన షూటింగ్ షెడ్యూల్స్ ను వాయిదా వేయాలని షారూక్ మూవీ టీంకు చెప్పారట. ఆయన ఒక నెల పాటు విశ్రాంతి తీసుకొనున్నారని సమాచారం.
ఈ క్రమంలో సెప్టెంబర్ లో కింగ్ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభం కానుంది. ఇకపోతే కింగ్ సినిమాలో దీపికా పదుకొనె, అనిల్ కపూర్, జాకీ ష్రఫ్ వంటి అగ్ర తారలు నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.









