Shah Rukh Khan Vadodara Case | పుష్ప-2 (Pushpa 2) సినిమా విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ (Sandhya Theatre) లో జరిగిన ఘటనపై నటుడు అల్లు అర్జున్ (Allu Arjun Arrest)ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం ఆయన్ని నాంపల్లి కోర్టు (Nampally Court) ఎదుట ప్రవేశ పెట్టారు. అల్లు అర్జున్ కు రిమాండ్ విధించాలని పోలీసులు కోర్టును కోరుతున్నారు. అల్లు అర్జున్ పై నమోదైన కేసులో పోలీసులు షారుఖ్ కేసును ఉదహరిస్తున్నారు.
2017లో షారుఖ్ ఖాన్ తన సినిమా రాయిస్ ప్రమోషన్ లో భాగంగా మూవీ టీంతో కలిసి గుజరాత్ లోని వడోదర రైల్వే స్టేషన్ కు వెళ్లారు. అభిమానులు పెద్ద ఎత్తున రావడంతో తొక్కిసలాట జరిగి ఓ అభిమాని మరణించాడు.
దీంతో కాంగ్రెస్ నేత జితేంద్ర మధుభాయ్ సోలంకీ ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కింది కోర్టు తనకు సమన్లు జారీ చేయడంతో షారుఖ్ ఖాన్ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు.
వివిధ కారణాల వల్ల ఈ సంఘటన జరిగిందని, షారుఖ్ చర్యలు ఎవరి భద్రతకు హాని కలిగించే ప్రయత్నం చేయలేదని పేర్కొంటూ హైకోర్టు ఆ కేసును కొట్టేసింది. హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది.