Tuesday 17th March 2026
12:07:03 PM
Home > తెలంగాణ > షాద్‌నగర్‌ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌కు మంత్రి పదవి..?

షాద్‌నగర్‌ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌కు మంత్రి పదవి..?

Shadnagar MLA Veerlapalli Shankar's ministerial position..
  • హ్యాట్రిక్‌ ఎమ్మెల్యేను బోల్తా కొట్టించిన వీర్లపల్లి
  • వీర్లపల్లి సేవలను గుర్తించి హై కమాండ్‌
    మంత్రి పదవి ఇవ్వాలని ప్రజల అభ్యర్థన

నందిగామ ,కాంగ్రెస్‌ అనే మహా సము ద్రంలో మునిగిపోతున్న నావాకు నేనున్నా అంటూ గట్టెక్కించిన వీర్లపల్లి శంకర్‌ నిజమైన నాయకుడని,ప్రజల ఆదరణ పొంది హ్యాట్రిక్‌ విజయం సాధించబోయే ఎమ్మెల్యేని సైతం ఓడిరచి, షాద్‌ నగర్‌ ఎమ్మెల్యేగా గెలుపొందిన వీర్లపల్లి శంకర్‌ కు మంత్రి పదవి రావడం ఖాయమని షాద్‌ నగర్‌ నియోజకవర్గం ప్రజలు బాహాటంగానే చర్చించుకుంటున్నారు. షాద్‌ నగర్‌ నియోజకవర్గంలో రెండు సార్లు విజయం సాధించి ముందంజలో ఉంటూ హ్యాట్రిక్‌ విజయంపై కన్నేసిన బీఆర్‌ఎస్‌ కు ఎదురుదెబ్బ కొట్టాడు వీర్లపల్లి. ప్రతి పల్లె, ప్రతి తండా నా కుటుంబం అనుకునే వీర్లపల్లి శంకర్‌ కు మంత్రి పదవి కట్టబెట్టడం షాద్‌ నగర్‌ ప్రజలకు కొత్త వరం ఇచ్చినట్టు అవుతుందని ప్రజలు కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు.రెండు పర్యాయములు గెలిచిన బీఆర్‌ఎస్‌ పాలనలో అభివృద్ధి తిరోగమనంలో పయనించిందని,ఎక్కడ చూసిన శిలాఫలకాలకే పరిమితం అయ్యిందని ప్రజలు భావిస్తున్నారు.యువనేత, విద్యావంతుడు అహర్నిశలు జనం కోసం, సమాజం కోసం తనకు ఏ పదవి లేకున్నా శాయశక్తుల వెన్నంటు ఉండి కష్టపడిన వీర్లపల్లి శంకర్‌ కు మంత్రి పదవి కట్టబెడితే షాద్‌ నగర్‌ అభివృద్ధి పథంలో పయనిస్తోందని ప్రజాభిప్రాయాలు వ్యకమవుతున్నాయి.కాంగ్రెస్‌ హై కమాండ్‌ సానుకూలంగా స్పందించి వీర్లపల్లి శంకర్‌ కు మంత్రి పదవి కట్టబెడుతుందని ప్రజలు భావిస్తున్నారు.దీనిపై కాంగ్రెస్‌ హై కమాండ్‌ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి..

You may also like
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !
Minister Adluri Laxman
‘గోదావరి పుష్కరాలు ఘనంగా నిర్వహించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions