Setback To KTR In High Court | బీఆరెస్ ( Brs )వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR ) కు తెలంగాణ హై కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
ఫార్ములా ఈ కారు రేస్ ( Forumla E Car Race )కేసులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ ( Quash ) పిటిషన్ ను న్యాయస్థానం మంగళవారం కొట్టివేసింది. ఏసీబీ ( ACB ) నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కేటీఆర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయమ్ తెల్సిందే.
డిసెంబర్ 31న ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం తాజగా తీర్పును వెలువరించింది. కేటీఆర్ ను అరెస్ట్ చేయకుండా గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను కోర్టు ఉపసంహరించింది.
ఏసీబీ వాదనలను పరిగణలోకి తీసుకున్న కోర్టు ఈ మేరకు తీర్పును ఇచ్చింది. దింతో ఏసీబీ, ఈడీకి కేటీఆర్ ను విచారించేందుకు అనుమతినిచ్చినట్లైంది. మరోవైపు దీనిపై కేటీఆర్ సుప్రీం కోర్టు ( Supreme Court )ను ఆశ్రయించే అవకాశం ఉంది.