Tuesday 17th March 2026
12:07:03 PM
Home > క్రీడలు > రెండు మ్యాచుల్లో ఓడినా సెమీస్ కు పాకిస్థాన్..ఎలా అంటే !

రెండు మ్యాచుల్లో ఓడినా సెమీస్ కు పాకిస్థాన్..ఎలా అంటే !

Semis Chances For Pakistan | ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ( ICC Champions Trophy )లో భాగంగ ఆతిథ్య పాకిస్థాన్ సంక్లిష్ట పరిస్థితిని ఎదురుకుంటుంది. తొలి రెండు మ్యాచుల్లో ఓడిన పాక్ సెమీస్ ( Semi Finals ) కు చేరడం కష్టంగా మారింది.

అయితే పాక్ సెమీస్ అవకాశాలు సజీవంగానే ఉన్నాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గ్రూప్ ఏ ( Group-A )లో నాలుగు జట్లు ఉన్నాయి. ఇప్పటికే పాక్, న్యూజీలాండ్ ( New Zealand ) మరియు భారత్ చేతిలో ఓడిపోయింది.

సోమవారం జరగనున్న న్యూజీలాండ్-బంగ్లాదేశ్ మ్యాచ్ ఫలితంపై పాకిస్థాన్ సెమీస్ అవకాశం ఆధారపడింది. ఈ మ్యాచులో బంగ్లాదేశ్ గెలిస్తే పాక్ సెమీస్ కు వెళ్లే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఫిబ్రవరి 27న జరగబోయే మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై పాకిస్థాన్ కచ్చితంగా విజయం సాధించాలి.

అలాగే మార్చి 2న జరిగే మ్యాచులో న్యూజీలాండ్ ను భారత్ ఓడించాలి. ఇలా జరిగితే గ్రూప్-ఏ లో భారత్ ఆరు పాయింట్లతో టాప్ లో ఉంటుంది. మిగిలిన పాకిస్థాన్, న్యూజీలాండ్, బంగ్లాదేశ్ లు చోరో రెండు పాయింట్లను కలిగి ఉంటాయి. మెరుగైన నెట్ రన్ రేట్ ( Net Runrate ) కలిగిన జట్టు భారత్ తో పాటు నాకౌట్ కు చేరుకుంటుంది.

You may also like
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !
gaddar awards
గద్దర్ సినీ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం.. ఉత్తమ చిత్రం ఏదంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions