SC ST Sub Classification | ఎస్సి ( SC ), ఎస్టీ ( ST ) రిజర్వేషన్ల ( reservation ) వర్గీకరణ పై సర్వోన్నత న్యాయస్థానం ( Supreme Court ) సంచలన తీర్పు వెలువరించింది.
వర్గీకరణ పై రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సి, ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను ఉప వర్గీకరణ ( Sub Classification ) చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.
ఈ మేరకు 2004 లో ఐదుగురు సభ్యులు ఇచ్చిన తీర్పును తాజాగా ధర్మాసనం పక్కనపెట్టింది. 6:1 నిష్పత్తితో సిజేఐ జస్టిస్ డీ.వై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం గురువారం తీర్పును వెలువరించింది.
దీని వల్ల ఎస్సి, ఎస్టీ ల్లో వెనుకబడిన వర్గాలకు మేలు జరుగుతుందని న్యాయస్థానం అభిప్రాయం వ్యక్తం చేసింది.