Russian helicopter loses tail before crashing in flames | రష్యా దేశంలో తాజగా జరిగిన ఓ హెలికాప్టర్ ప్రమాదానికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. హెలికాప్టర్ తోక భాగం విరిగిపోవడంతో గాల్లోనే చక్కర్లు కొడుతూ సముద్రంపై కాసేపు గాల్లో ఎగిరింది.
ఆ తర్వాత పూర్తిగా నియంత్రణ కోల్పోవడంతో హెలికాప్టర్ క్రాష్ అయ్యింది. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు నలుగురు మరణించినట్టు తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే కిజ్లియార్ ఎలక్ట్రో మెకానికల్ ప్లాంట్ కు చెందిన Ka-226 హెలికాప్టర్ కిజ్లియార్ నుంచి ఇజ్బర్ బాష్ కు బయలుదేరింది. ఈ క్రమంలో అచి-సు అనే గ్రామం వద్ద కాస్పియన్ సముద్ర తీరం వద్ద హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది.
తోకభాగం విరిగిపోవడంతో కాసేపు గాల్లోనే తిరుగుతూ ఆ తర్వాత అదుపుతప్పడంతో హెలికాప్టర్ కుప్పకూలింది. ఇందులో కెమ్జీ సంస్థకు చెందిన సీనియర్ అధికారులు ఉన్నట్లు కథనాలు వస్తున్నాయి. అయితే ప్రమాదం జరగడంతో వారు మరణించారు. సాంకేతిక లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. రష్యన్ ఫెడరల్ ఏవియేషన్ ఏజెన్సీ ఈ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించింది.









