Ruckus Outside Delhi Assembly Over Baba Saheb Row | ఢిల్లీ అసెంబ్లీ సమావేశాల్లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన విషయం తెల్సిందే.
అనంతరం రేఖా గుప్తా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే సీఎం కార్యాలయంలో రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్, భగత్ సింగ్ ఫోటోలను తొలగించారని ప్రతిపక్ష ఆప్ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు.
అంబేడ్కర్ ఫోటో స్థానంలో ప్రధాని మోదీ ఫోటోను పెట్టారని మాజీ ముఖ్యమంత్రి అతిశీ నిప్పులుచేరిగారు. మంగళవారం ఉదయం లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా అసెంబ్లీలో ప్రసంగించారు. ఈ సమయంలో ఆప్ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు.
ఈ క్రమంలో స్పీకర్ విజేందర్ గుప్తా ఆప్ ఎమ్మెల్యేలను ఒక రోజు పాటు సభ నుండి సస్పెండ్ చేశారు. అలాగే మద్యం విధానం పై కాగ్ నివేదిక పట్ల కూడా అధికార బీజేపీ, ప్రతిపక్ష ఆప్ ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం జరిగింది.