RSP Meets KCR | పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయాల్లో (Telangana Politics) ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మాజీ సీఎం, బీఆరెస్ (BRS) అధినేత కేసీఆర్(KCR) తో బీఎస్పీ (BSP) రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) భేటీ అయ్యారు.
మంగళవారం హైదరాబాద్ నందినగర్ లోని కేసీఆర్ నివాసం లో ఈ భేటీ జరిగింది. వీరిద్దరి భేటీ సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కొద్దీ రోజులుగా ఆరేస్ ప్రవీణ్ బీఆరెస్ లో చేరనున్నారు అంటూ జోరుగా ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారం లో ఎలాంటి వాస్తవం లేదని కొట్టిపారేశారు ఆరేస్ ప్రవీణ్.
తాజాగా కేసీఆర్ ను ఆరెస్పీ కలవడంతో ఈ భేటి మరోసారి చర్చనీయాంశంగా మారింది. సుదీర్ఘ భేటి తర్వాత కేసీఆర్, ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు.
ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తు కుదుర్చుకున్నట్లు ప్రకటించారు. లోక్ సభ ఎన్నికల్లో బీఆరెస్ బీఎస్పీ కలిసి పోటీ చేయనున్నట్లు ఇరువురూ వెల్లడించారు.
సీట్ల పంపకాలకు సంబంధించి మరోసారి చర్చించి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. బీఎస్పీ అధినేత్రి మాయావతితో కూడా త్వరలో మాట్లాడనున్నట్లు కేసీఆర్ తెలిపారు.
అనంతరం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ మాయావతితో చర్చించిన తర్వాతే పొత్తు ఫిక్స్ చేశామని తెలిపారు. దేశంలో సెక్యులరిజం ప్రమాదంలో ఉందనీ, బీజేపీతో పోరాడేందుకే ఈ పొత్తు కుదుర్చుకున్నట్లు వివరించారు.