RPF DG Insignia Awards 2026 | దక్షిణ మధ్య రైల్వేకు చెందిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) అధికారులు, సిబ్బంది తమ విధుల్లో చూపిన ఉత్తమ సేవలకు గాను ప్రశంసా పత్రాలు అందుకున్నారు. హైదరాబాద్‌లోని మౌలాలి వద్ద ఉన్న RPF ట్రైనింగ్ సెంటర్‌లో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక అవార్డు కార్యక్రమంలో వారికి డైరెక్టర్ జనరల్ (DG) ఇన్‌సిగ్నియా మరియు ప్రశంసా పత్రాలు అందజేశారు.
ఈ కార్యక్రమానికి దక్షిణ మధ్య రైల్వే RPF ఐజీ-కమ్-ప్రిన్సిపల్ చీఫ్ సెక్యూరిటీ కమిషనర్ అరోమా సింగ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరై, అవార్డులను ప్రదానం చేశారు.
26 మంది అధికారులు, సిబ్బందికి గౌరవం
ఈ సందర్భంగా మొత్తం 26 మంది RPF అధికారులు మరియు సిబ్బంది డీజీ ఇన్‌సిగ్నియా, ప్రశంసా పత్రాలను అందుకున్నారు.
- 2024 గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో విశిష్ట ప్రదర్శన కనబరిచిన 10 మంది RPF సిబ్బంది
- 2025 గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో పాల్గొన్న 13 మంది సిబ్బంది
- 2025 మహా కుంభమేళా సమయంలో విధుల్లో ఉత్తమ సేవలందించిన ఇద్దరు అధికారులు
అదేవిధంగా హైదరాబాద్ సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ దేవశ్మితా సి. బెనర్జీ ప్రతిష్టాత్మకమైన ప్రధానమంత్రి సిల్వర్ కప్ కేస్ స్టడీ గెలుచుకున్నందుకు ఈ గౌరవాన్ని అందుకున్నారు.
ఆల్ ఇండియా పోలీస్ బ్యాండ్ పోటీల్లో కృషికి ప్రశంసలు
ఇటీవల దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో నిర్వహించిన 26వ ఆల్ ఇండియా పోలీస్ బ్యాండ్ పోటీ విజయవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించిన RPFకు చెందిన ఆరుగురు అధికారులకు కూడా డీజీ ప్రశంసా పత్రాలను అరోమా సింగ్ ఠాకూర్ అందజేశారు.
ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించడంలో చేసిన కృషికి గాను అరోమా సింగ్ ఠాకూర్ గారికే కూడా డీజీ ప్రశంసా పత్రం లభించింది.
RPF సేవలపై ప్రశంసలు
అవార్డులను అందజేస్తూ అరోమా సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ, అవార్డు గ్రహీతలను అభినందించారు. రైల్వే ప్రయాణికులు మరియు రైల్వే ఆస్తుల భద్రత కోసం వారు చూపుతున్న అంకితభావం, నిబద్ధత, బాధ్యతాయుతమైన సేవలను ఆమె ప్రశంసించారు.
క్రమశిక్షణ, టీమ్ వర్క్, విధి పట్ల ఉన్న బాధ్యతాభావం RPF బలగానికి అత్యంత ముఖ్యమని ఆమె పేర్కొన్నారు. ఇవే లక్షణాలు భవిష్యత్తులో ఎదురయ్యే భద్రతా సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవడంలో సహాయపడతాయని తెలిపారు.
కార్యక్రమానికి హాజరైన అధికారులు
ఈ కార్యక్రమానికి RPFకు చెందిన పలువురు సీనియర్ అధికారులు, సిబ్బంది హాజరయ్యారు. వారు అవార్డు గ్రహీతలను అభినందించారు.
అలాగే ఈ అవార్డు కార్యక్రమాన్ని పరేడ్ సమయంలో శిక్షణ పొందుతున్న 204 మంది ట్రైనీ సబ్ ఇన్‌స్పెక్టర్ కేడెట్లు కూడా వీక్షించారు. ఈ కార్యక్రమం వారికి ప్రేరణగా నిలిచిందని అధికారులు తెలిపారు.







