Robinhood Postponed | టాలీవుడ్ నటుడు నితిన్ (Nithin), శ్రీలీల (Srileela) జంటగా నటిస్తున్న తాజా చిత్రం రాబిన్‌హుడ్. వెంకీ కుడుముల (Venky Kudumula) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ (Mythry Movie Makers) నిర్మిస్తోంది.
జీవీ ప్రకాశ్ కుమార్ (GV Prakash Kumar) సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రంలో డిసెంబర్ 25న గ్రాండ్ రిలీజ్ కావాల్సి ఉంది. సినిమా ప్రమోషన్స్ కి కూడా సిద్ధమైంది. అయితే ఈ సినిమా అనుకున్న సమయానికి విడుదల కావడం లేదు. సినిమా వాయిదా పడిన విషయాన్ని చిత్రబృందం ధృవీకరించింది.
‘అనివార్య పరిస్థితుల కారణంగా రాబిన్‌హుడ్ (Robinhood) సినిమా షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 25న విడుదల కావడం లేదు. త్వరలో కొత్త విడుదల తేదీని ప్రకటిస్తాం. ఇదే ఉత్సాహంతో కొంత సమయం వేచి ఉండండి. అందుకు తగిన ఎంటర్ టైన్ మెంట్ ను అందిస్తాం. ఈ అడ్వెంచరస్ ఎంటర్‌టైనర్ థియేటర్‌లలోకి వచ్చినప్పుడు మరపురాని అనుభూతిని కలిగిస్తుంది! ” అని సినిమా యూనిట్ పేర్కొంది.